వికారాబాద్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు కరోనా

March 05, 2021
img

వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోగల శివారెడ్డిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా బారిన పడ్డారు. వారికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు దృవీకరించారు. వారికి కరోనా సోకడంతో గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న 40 మంది సిబ్బంది, మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్దులకు జిల్లా వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలో 8,9, 10 తరగతులకు చెందిన 100 మంది విద్యార్దులు చదువుకొంటున్నారు. ఇటీవలే తరగతులు మొదలవడంతో వారందరూ పాఠశాలకు వచ్చారు. వారిలో కొంతమంది జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడుతునట్లు గుర్తించిన వైద్య సిబ్బంది వారిని క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించారు. పాఠశాలలో కరోనా వ్యాపించకుండా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలననే తమ పిల్లలకు కరోనా బారిన పడ్డారంటూ విద్యార్దుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో అన్ని పాఠశాలలు అప్రమత్తం చేసింది విద్యాశాఖ.      


Related Post