బ్రెజిల్లో మళ్ళీ కరోనా విలయతాండవం

March 03, 2021
img

కరోనా మొదటి దశలో అమెరికా తరువాత ప్రపంచలోకెల్లా అత్యధిక కేసులు, మరణాలు సంభవించిన దేశంగా బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో గత రెండు నెలలుగా కరోనా ఉదృతి తగ్గి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. కానీ మళ్ళీ హటాత్తుగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోయాయి. 135 కోట్లుకు పైగా జనాభా... దానిలో సగానికి పైగా పేదరికంలో మగ్గుతున్న భారత్‌లో మంగళవారం 98 మంది కరోనాతో చనిపోగా, కేవలం 22 కోట్లు మాత్రమే జనాభా ఉన్న బ్రెజిల్ దేశంలో 1,641 మంది మరణించారంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.      



కరోనాను కట్టడి చేయడానికి మంచి మందులు, అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా బ్రెజిల్లో కరోనా మహమ్మారి ఇంతగా విజృంభించి ప్రజల ప్రాణాలు బలిగొంటుండటం చాలా ఆశ్చర్యకరమే. ఇటీవల వరుసగా వచ్చిన కొన్ని పండుగలు, ఉత్సవాల కారణంగా దేశంలో మళ్ళీ కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని బ్రెజిల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు చెపుతున్నారు. అయితే భారత్‌లో అనేక మతాల ప్రజలున్నందున ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట నిత్యం ఏదో ఓ పండుగ జరుగుతూనే ఉంటుంది. అయినా దేశంలో కరోనా నియంత్రణలోకి వచ్చింది. అంటే భారత్‌లో ప్రజలు, ప్రభుత్వాలు క్రమశిక్షణ పాటించడం వలననే ఇది సాధ్యమైందని, బ్రెజిల్ ప్రజలు, ప్రభుత్వం కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించడం వలననే ఆ దేశంలో మళ్ళీ కరోనా తిరగబెట్టినట్లు అర్ధమవుతోంది. బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పుడు మేల్కొని కరోనాను కట్టడి చేయడానికి మళ్ళీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌, కర్ఫూలు విధించడానికి సిద్దపడుతోంది.

Related Post