టీకా కేంద్రాలవద్దే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

March 02, 2021
img

కరోనా టీకాలు వేయించుకొనేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిన్ పోర్టల్‌ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షరతు విధించింది. అయితే చాలా మందికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతున్నట్లు గుర్తించిన తెలంగాణ ఆరోగ్యశాఖ టీకా కేంద్రాల వద్దనే సిబ్బంది సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకొని టీకాలు వేయించుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన చేశారు. దీర్గకాలిక రోగాలతో బాధపడుతున్నవారు తాము వాడుతున్న మందులు, టెస్ట్ రిపోర్టులు, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఉంటే వాటిని చూపించి కరోనా టీకాలు వేయించుకోవచ్చునని తెలిపారు. ఒకవేళ వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ లేకపోయినా టీకా కేంద్రాలవద్ద ఉండే వైద్యులే పరీక్షలు చేసి దృవీకరిస్తారని తెలిపారు. కోవిన్, ఆరోగ్యసేతు రెండు యాప్‌లలో కూడా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా వేయించుకొనేందుకు అపాయింట్మెంట్ తీసుకొనేవెసులుబాటు యధాతధంగా కొనసాగుతుందని కూడా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వాసుపత్రులలో, 45 ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా టీకాలు వేస్తారని కనుక ప్రజలు తమకు సమీపంలో ఉండే ఆసుపత్రిలో టీకాలు వేయించుకోవచ్చునని శ్రీనివాసరావు తెలిపారు.             


Related Post