యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్ క్రికెట్‌కు గుడ్ బై

February 27, 2021
img

ఒకే రోజు ఇద్దరు భారత క్రికెటర్లు యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

 యూసఫ్ పఠాన్: భారత క్రికెట్ జట్టుకు లభించిన ఆల్రౌండర్లలో యూసఫ్ పఠాన్ ఒకరు. అటు బ్యాటింగ్‌తో ఇటు బౌలింగ్‌లో కూడా బాగా రాణించారు. భారత్‌ జట్టు తరపున యూసఫ్ పఠాన్ 57 వన్డేలు ఆడారు. 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో, 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ జట్టులో ఆడారు. 

వినయ్ కుమార్: భారత మీడియం పేసర్ వినయ్ కుమార్ ఒక టెస్ట్ మ్యాచ్, 31 వన్డేలు ఆడారు. 

యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్ ఇద్దరూ నిన్న ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.


Related Post