రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు?

February 26, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి గత నెలరోజులుగా రోజుకు కేవలం 166-170 కొత్త కేసులు మాత్రమే నమోదవుతుండేవి. కానీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటలలో మళ్ళీ భారీగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 96, హైదరాబాద్‌లో 50, మేడ్చల్‌ జిల్లాలో 46, ఆదిలాబాద్‌ జిల్లాలో 20, నల్గొండ జిల్లాలో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9, నిజామాబాద్‌ జిల్లాలో 9, వికారాబాద్ జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంటే అన్నీ కలిపి మొత్తం 248 కేసులన్నమాట! రాష్ట్రంలో ఇంకా మిగిలిన జిల్లాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకేసారి సుమారు 70-80 కేసులు పెరగడం నిజంగా ఆందోళనకరమైన విషయమే. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ హటాత్తుగా పెరిగినందునే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్లు విడుదల చేయడం నిలిపివేసిందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేటి నుంచి ప్రతీరోజు తప్పనిసరిగాకరోనా బులెటిన్లు విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related Post