అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలి: మంత్రి ఈటల

February 23, 2021
img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో రాష్ట్ర సరిహద్దు జిల్లాలలో నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో కూడా కరోనా  కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. కావున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతవారం కరీంనగర్‌లో ఓ వ్యక్తి అంతిమయాత్రకు హాజరైన 33 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. కావున ఆయా జిల్లాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌కు అన్నారు.


Related Post