సీతక్క ముందే చెప్పారుగా.. ఫుడ్ పాయిజన్ కేసులపై విచారణ!

November 28, 2024
img

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజినింగ్ జరుగుతుండటం, విద్యార్ధులు అస్వస్థతకి గురవుతుండటం అనుమానంగా ఉందని మంత్రి సీతక్క ఈరోజే చెప్పారు. దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, విచారణ జరిపించి అన్నీ సాక్ష్యాధారాలతో నిజాలు, బాధ్యులను బయటపెడతామని చెప్పారు. 

ఆమె చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వరుస ఘటనలపై విచారణ జరిపేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్ సేఫ్టీ కమీషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలో ఫుడ్ పాయిజినయింగ్ అయిన అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులలో పర్యటించి ఆహారం తయారు చేసేందుకు వాడుతున్న ముడిసరుకులు, వండుతున్న విధానాలను, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలిస్తుంది. 

ఇదికాక రాష్ట్రంలో ప్రతీ పాఠశాలలో ఇకపై ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ ఉపాద్యాయుడు, పాఠశాల సిబ్బంది దీనిలో సభ్యులుగా ఉండాలని సూచించింది. వారు ప్రతీరోజు వంటశాల పరిశుభ్రత మొదలు ఆహారం నాణ్యతా వరకు ప్రతీ అంశాన్ని పరిశీలించాలని, ఆహారం వండి పిల్లలకు వడ్డించే ముందు తప్పనిసరిగా కమిటీ సభ్యులు రుచి చూసి, ఎటువంటి తేడా లేదా ధృవీకరించుకోవాలని సూచించింది. ఇకపై ఆహారం విషయంలో ఎటువంటి తేడా వచ్చినా ఫుడ్ సేఫ్టీ కమిటీలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం వేరేగా చెప్పక్కరలేదు.   


Related Post