ఇంటర్ పరీక్ష ఫీజులు వివరాలు ప్రకటించిన బోర్డ్

November 05, 2024
img

తెలంగాణ ఇంటర్ బోర్డ్ నేడు ఇంటర్ వార్షిక పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులు వివరాలు ప్రకటించింది. రేపు (బుధవారం) నుంచి ఈ నెల 26 వరకు ఎటువంటి అపరాద రుసుము లేకుండా ఫీజులు చెల్లించవచ్చు. ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షలకి జనరల్ విద్యార్దులకు ఫీజు రూ. 520 కాగా, ఒకేషనల్ విద్యార్ధులకు రూ. 750 ఫీజుగా నిర్ణయించింది. ఇంటర్ ద్వితీయ జనరల్ ఆర్ట్స్ విద్యార్దులకు రూ.520, ద్వితీయ సైన్స్ విద్యార్దులకు రూ.750 ఫీజుగా నిర్ణయించింది. నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4వరకు రూ.1,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు.  

రేపటి నుంచే కుల గణన: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు (బుధవారం) నుంచే కుల గణన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ప్రాంతంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి కుటుంబ సభ్యులను కలిసి 56 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేస్తారు. ఇది పేరుకి కుల గణనే అయినప్పటికీ, ఆస్తులు, ఆదాయం, అప్పులు, వాహనాలు, కుటుంబ సభ్యుల విద్యార్హతలు, ఉద్యోగం, ఉపాది, కుటుంబంలో ఎవరైనా సంక్షేమ పధకాలు పొందుతున్నారా లేదా వగైరా వివరాలు కూడా అడిగి నమోదు చేస్తారు. అలాగే ఇంట్లో వాడుతున్న గృహోపకరణాల వివరాలు కూడా నమోదు చేస్తారు. 

విద్యాశాఖ నుంచి మొత్తం 48,229 మంది పాల్గొంటారు. మరో 32,000 మంది ప్రభుత్వోద్యోగులు కూడా ఈ సర్వేలో పాల్గొంటారు. రెండు వారాలలో ఈ సర్వే పూర్తి నెలాఖరులోగా కంప్యూటర్ల ఎక్కించాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఈ సర్వే మొదలుపెట్టబోతోంది.          


Related Post