దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రాలు ఇవే

October 12, 2024
img

ఒకప్పుడు వైద్య విద్య అభ్యసించాలని అనుకునేవారికి తగినన్ని ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండేవి కావు. ఆ కారణంగా రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిపిన్స్ వంటి ఇతర దేశాలకు వెళ్ళి వైద్యవిద్య అభ్యసించ వలసి వచ్చేది. కానీ కరోనా మహమ్మారి దేశాన్ని గజగజ వణికించినప్పుడు వైద్యులు, నర్సుల కొరత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగా కనబడటంతో, అన్ని రాష్ట్రాలలో కొత్తగా వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం మొదలైంది.

కనుక ఇప్పుడు వైద్య వృత్తి చేపట్టాలనుకునే విద్యార్ధులకు భారీగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 731 మెడికల్ కాలేజీలు వాటిలో 1.12 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

దేశంలో అత్యధికంగా కర్ణాటకలో  12,345 సీట్లు అందుబాటులో ఉండగా దాని తర్వాత స్థానాలలో వరుసగా తమిళనాడులో 11,900, మహారాష్ట్రలో 10,945, ఉత్తరప్రదేశ్ 10,525 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో 8,490, ఏపీలో 6,485 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో అతి చిన్నదైన మేఘాలయలో 50 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏయే రాష్ట్రాలలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో ఈ మ్యాప్ చూస్తే తెలుస్తుంది.     


Related Post