వైద్య ఆరోగ్యశాఖలో 2,050 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

September 19, 2024
img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్సు) ఉద్యోగాల భర్తీకి ఆ శాఖలోని రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలో అత్యధికంగా 1,576 పోస్టులు భర్తీ చేయబోతుండగా, తెలంగాణ వైద్యవిధాన పరిషత్-332 పోస్టులు, ఎంఎన్జె క్యాన్సర్ ఆస్పత్రిలో 80 పోస్టులు, ఆయూష్ ఆస్పత్రిలో 61 పోస్టులు, ఐపీఎంలో ఒక పోస్టు కలిపి మొత్తం 2050 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. 

జోన్లు వారీగా ఖాళీలు ఈవిదంగా ఉన్నాయి: జోన్‌-1: 241; జోన్‌-2: 86; జోన్‌-3: 246; జోన్‌-4: 353; జోన్‌-5: 187; జోన్‌-6: 747; జోన్‌-7: 114 పోస్టులు భర్తీ చేయనున్నారు.   

విద్యార్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.     

వయో పరిమితి: 18 నుంచి గరిష్టంగా 2024, ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 46 ఏళ్ళకి మించకూడదు. అయితే దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది. అదేవిదంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి మూడేళ్ళు సడలింపు ఉంటుంది. 

నవంబర్‌ 17వ తేదీన హైదరాబాద్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాలలో ఆన్‌లైన్‌ విధానంలో (80 మార్కులు) పరీక్షలు నిర్వహిస్తారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ పరీక్షలో 20 మార్కులు వెయిటేజ్ లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కోసం రిక్రూట్‌మెంట్ బోర్డు అధికార వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm లో చూడవచ్చు.

Related Post