లైబ్రెరియన్లుగా ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితా విడుదల

September 10, 2024
img

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. తాజాగా ఇంటర్ మరియు సాంకేతిక కళాశాలలో 64 లైబ్రెరియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాని టీజీపీఎస్‌ఎస్సీ సోమవారం ప్రకటించింది. వీటిలో ఇంటర్ ఎడ్యుకేషన్ విభాగంలో 38 పోస్టులు ఉండగా వాటిలో మల్టీజోన్‌-1లో 18 పోస్టులు, మల్టీజోన్‌-2లో 20 పోస్టులను భర్తీ చేసింది. 

అదేవిదంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ వివ్హాగంలో 26 పోస్టులలో కాళేశ్వరం (జోన్ 1)లో ఒక పోస్టు, బాసర(జోన్-2) 3 పోస్టులు, రాజన్న సిరిసిల్ల (జోన్-3)లో 6 పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం (జోన్-4)లో 6 పోస్టులు, యాదాద్రి భువనగిరి (జోన్-5)లో 3 పోస్టులు, చార్మినార్ (జోన్-6)లో 7 పోస్టులు, జోగుళాంబ గద్వాల్ (జోన్-7)లో 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులను ప్రకటించింది.  

వ్రాత పరీక్ష ద్వారా ఒక పోస్టుకి ఇద్దరు అభ్యర్ధుల చొప్పున ఎంపిక చేసి వారి ధృవ పత్రాలు పరిశీలించిన తర్వాత టీజీపీఎస్‌ఎస్సీ వారి వివరాలను వెల్లడించింది. టీజీపీఎస్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.in లో వారు తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. 


Related Post