తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్‌ఎస్సీ) నేడు గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15,16 తేదీలలో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్‌ఎస్సీ తెలియజేసింది. పరీక్షలకు వారం రోజుల ముందుగా హాల్ టికెట్స్ జారీ చేస్తామని తెలియజేసింది.
పాత షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెలలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అదే సమయంలో వేరే పోటీ పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్ధులు ఒత్తిడి చేయడంతో సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి కొత్త షెడ్యూల్ ప్రకటించాల్సిందిగా టీజీపీఎస్‌ఎస్సీని ఆదేశించారు. ఆయన సూచన మేరకు గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15,16 తేదీలకు మార్చింది. గ్రూప్-2లో 783 పోస్టులకు మొత్తం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.