గ్రూప్-1,2,3 పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న టీజీపీఎస్‌ఎస్సీ

June 20, 2024
img

గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్‌ఎస్సీ ఉద్యోగాల భర్తీకి మొదలుపెట్టిన ప్రక్రియని అందరికీ తెలిసున్న వివిద సమస్యలు, కారణాల వలన పూర్తిచేయలేకపోయింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్‌ఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయడంతో ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. 

ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించింది. త్వరలోనే వాటి ఫలితాలు ప్రకటించబోతోంది. గ్రూప్-1లో 563 ఉద్యోగాలకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుమారు 3 లక్షల మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారిలో ఒక్కో పోస్టుకి 50 మంది చొప్పున అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మెయిన్ పరీక్షలకు ఎంపిక చేస్తున్నారు. 

గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1,388 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్‌ఎస్సీ పరీక్షలు నిర్వహించబోతోంది. ఆ వివరాలు...  

గ్రూప్-2 పరీక్షలు: ఆగస్ట్ 7,8. 

గ్రూప్-1 మెయిన్ పరీక్షలు: అక్టోబర్ 21 నుంచి. 

గ్రూప్-3 పరీక్షలు: నవంబర్‌ 17,18.

Related Post