టెట్ ఫలితాలు ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి

June 12, 2024
img

తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలను సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో విడుదల చేశారు. 

టెట్ పేపర్-1 పేపర్ పరీక్షకు  85,996 మంది హాజరుకాగా వారిలో 57,725 మంది అంటే 67.13 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. అదేవిదంగా టెట్ పేపర్-2 పేపర్ పరీక్షకు 1,50,491 మంది హాజరుకాగా వారిలో 51,443 మంది అంటే 34.18 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 

ఈ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులు www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. గత ఏడాది పేపర్-1 ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది పేపర్-1లో ఉత్తీర్ణత 18.88 శాతం పెరిగిందని తెలిపారు. 

 రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునే టెట్-2024 ఫీజు తగ్గించలేకపోయామని చెప్పారు. కనుక ఈసారి టెట్‌లో అర్హత సాధించనివారు వచ్చే టెట్ పరీక్షకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అదేవిదంగా ఈసారి టెట్‌లో అర్హత సాధించినవారు డీఎస్సీకి ఎలాంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Related Post