తెలంగాణలో జూన్ 3 నుంచి బడి బాట

May 30, 2024
img

రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యాశాఖ ఉపాధ్యాయుల కోసం బడిబాట కార్యక్రమం మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 3 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాల పరిధిలోని గ్రామాలలో పర్యటించి పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించాల్సిందిగా తల్లితండ్రులకు చెప్పాలని, కొత్త విద్యార్ధులను గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. 

జూన్ 3 నుంచి ప్రతీరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు గ్రామాలలో పర్యటించాలని విద్యాశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలు తీసుకోవాలని సూచించింది. 

ఇంతవరకు పాఠశాలలో చేరకుండా ఉండిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రులకు నచ్చజెప్పి అంగన్వాడీ లేదా పాఠశాలలో జెర్పించేందుకు ఉపాధ్యాయులు గట్టిగా ప్రయత్నించాలని విద్యాశాఖ ఉత్తర్వులలో పేర్కొంది.

జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోలు, పాఠశాలల హెడ్ మాస్టర్లు అందరూ కలిసి చర్చించుకొని కార్యాచరణ రూపొందించుకొని సమన్వయంతో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ సూచించింది. 

Related Post