ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రభుత్వం గురువులకు కానుక

September 05, 2023
img

నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం జీవో (నం: 11) జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది.  

 ముఖ్యమంత్రి కార్యాలయం ఈవిషయం తెలియజేస్తూ, “ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది,” అని ట్వీట్‌ చేసింది. దీంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

రాష్ట్రంలో ఉపాధ్యాయులు బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కూడా ఇటీవల మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.  


Image

Related Post