తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ మళ్ళీ షురూ

September 01, 2023
img

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌ 3 నుంచి ఈ ప్రక్రియను మళ్ళీ ప్రారంభించబోతోంది. హైకోర్టు తుదితీర్పుకు లోబడే ఈ బదిలీలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియకు సంబందించి తక్షణం షెడ్యూల్ విడుదల చేయాలని ఆదేశించారు.

వచ్చే నెల 3వ తేదీలోగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించి, బదిలీలల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. బదిలీలు కోరుకొంటున్న ఉపాధ్యాయులు అందరూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సూచించింది.

ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనంగా 10 పాయింట్స్ కలపరాదని, భార్యాభర్తలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి మాత్రమే 10 పాయింట్స్ కలపాలని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాలలో పనిచేస్తున్న భార్యభర్తలకు బదిలీలలో తొలిప్రాధాన్యం ఇవ్వాలని కూడా హైకోర్టు సూచించింది.

హైకోర్టు సూచనలకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ ఈ బదిలీల ప్రక్రియను ఆదివారం నుంచి పునః ప్రారంభించబోతోంది. కనుక మళ్ళీ ఎటువంటి అవరోధాలు లేకుండా అన్నీ సవ్యంగా సాగితే భార్యాభర్తలైన ఉపాధ్యాయులు ఒకేచోట ఉద్యోగాలు చేసుకొంటూ సంతోషంగా పండుగలు జరుపుకోగలుగుతారు.

Related Post