తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు టిఎస్‌పీఎస్సీకి ఆన్‌లైన్‌లో సమర్పించిన తమ దరఖాస్తులలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దుకోవడానికి ఆగస్ట్ 16 నుంచి 21వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. అభ్యర్ధులు తమ పేరు, వయసు, ఇంటిపేరు, చిరునామా వంటి చిన్న చిన్న మార్పులు చేసుకొనేందుకు ఆన్‌లైన్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. అయితే అభ్యర్ధులు వాటికి సంబందించిన ధృవీకరణ పత్రాలతో సరిపోలి ఉండాలని తెలియజేసింది. కనుక అభ్యర్ధులందరూ ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తులలో తప్పులను సవరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ని కూడా టిఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. దీనిపై ఆగస్ట్ 17 నుంచి 19 వరకు అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చునని తెలిపింది.