తెలంగాణ పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు, కీ విడుదల

May 31, 2023
img

తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం అర్దరాత్రి విడుదల చేసింది. వాటితో పాటు తుదిరాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధుల ఓఎమ్మార్ షీట్లను, తుది ఫైనల్ కీని కూడా వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు తమ మార్కుల రీ కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేయించుకొని పునః పరిశీలించుకోవచ్చు. దీని కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.2,000, ఇతర కులాలవారు, స్థానికేతరులు రూ.3,000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. జూన్ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్ 3 రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఫలితాలు, ఫైనల్ కీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ విషయంలో అభ్యర్ధులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 93937 11110  లేదా 939100 5006 ఫోన్‌లో నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు లేదా support@tslprb.in ఈమెయిల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.    


Related Post