తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి

May 25, 2023
img

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో 86%, ఇంజనీరింగ్ విభాగంలో 80% ఉత్తీర్ణత సాధించిన్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అదేవిదంగా అగ్రికల్చర్ విభాగంలో బాలికలు 87%, బాలురు 84% ఉత్తీర్ణత సాధించగా ఇంజనీరింగ్ విభాగంలో బాలికలు 82%, బాలురు 79% ఉత్తీర్ణత సాధించిన్నట్లు మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఇంజనీరింగ్ విభాగాలలో ఆంధ్రాకు చెందిన బాలబాలికలే ఎక్కువ మంది టాప్ ర్యాంక్స్ సాధించడం విశేషం. 

విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్‌ నంబరుతో చూసుకోవచ్చు. త్వరలోనే ఎంసెట్ అడ్మిషన్స్ ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.    

ఇంజనీరింగ్ టాపర్లు: బోయిన సంజనా (శ్రీకాకుళం), మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం), సనపల అనిరుద్ (విశాఖపట్నం), మారదాన ధీరజ్ కుమార్‌ (విశాఖపట్నం), ఎక్కింటిపాణి వెంకట మణీందర్ రెడ్డి (గుంటూరు), చాలా ఉమేష్ వరుణ్ (నందిగామ), పొన్నతోట ప్రమోద్ కుమార్‌ రెడ్డి (తాడిపత్రి), నంద్యాల ప్రిన్స్ బ్రహ్మం రెడ్డి (నంద్యాల), అభినీత్ మాజేటి (కొండాపూర్), వద్దే శాన్విత రెడ్డి (నల్గొండ). 

అగ్రికల్చర్ టాపర్లు: బొర వరుణ్ కఃక్రవర్తి (శ్రీకాకుళం), బూరుగుపల్లి సత్యరాజ జస్వంత్ (తూర్పు గోదావరి), దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి (గుంటూరు), దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి), నాశిక వెంకట తేజ (చీరాల), వఙ్గీపురమ్ హర్షిల్ సాయి (నెల్లూరు), గంధమనేని గిరివర్షిత (అనంతపురం), పసుపులేటి సఫల్ లక్ష్మి (సరూర్ నగర్‌), కొల్లబాతుల ప్రీతం సిద్దార్థ్ (హైదరాబాద్‌), దేవగుడి గురు శశిధర్ రెడ్డి (హైదరాబాద్‌). 

Related Post