ఖమ్మంలో 29న జాబ్‌ మేళా... పొంగులేటి అధ్వర్యంలో

May 25, 2023
img

బిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో ఈ నెల 29న ఖమ్మంలోని వెలుగుమట్ల వద్ద గల ఎస్సార్ గార్డెన్స్ లో జాబ్‌ మేళా జరుగబోతోంది. దీనిలో 100కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొని దాదాపు 10 వేల మందిని నియమించుకోబోతున్నాయని పొంగులేటి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాబ్‌ మేళా జరుగుతుందని, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు తమ పేర్లను నమోదు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పొంగులేటి కార్యాలయం కోరింది. 

అర్హతలు: పదో తరగతి నుంచి డిగ్రీ వరకు దేనిలోనైనా ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంబీయే, ఎంసీఏ, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్‌లో మేనేజిమెంట్ కోర్సులు చేసినవారు ఇంకా డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవారు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చు. దివ్యాంగులు, చెవిటి,మూగ, ట్రాన్స్ జండర్స్ కూడా ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చని పొంగులేటి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. ఈ జాబ్‌ మేళాకు సంబదించి వివరాల కోసం అభ్యర్ధులు 9642333667,9642333668 ఫోన్‌ నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. హెచ్ఆర్ హెల్ప్ లైన్ నంబర్: 7097655912. 

Related Post