ఆ నాలుగు పరీక్షలు రద్దు చేసిన టిఎస్‌పీఎస్సీ

March 16, 2023
img

ప్రశ్నాపత్రాల లీకేజి కారణంగా మార్చి 5వ తేదీన నిర్వహించిన ఏఈ, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని టిఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు బుదవారం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. 

టిఎస్‌పీఎస్సీ మొత్తం 837 ఉద్యోగాల భర్తీకి మార్చి 5వ తేదీన పరీక్షలు నిర్వహించగా మొత్తం 74,478 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో 55,000 మంది పరీక్ష వ్రాసి ఫలితలా కోసం ఎదురు చూస్తుండగా, ఈ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం బయటపడింది. దీంతో టిఎస్‌పీఎస్సీ న్యాయనిపుణుల సలహా తీసుకొంది. ఆ పరీక్షలను రద్దు చేయకుండా ముందుకు సాగితే న్యాయవివాదాలు మొదలవుతాయని భావించి ఆ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని నిర్ణయించింది.       


Related Post