బుదవారం నుంచి ఇంటర్ పరీక్షలు... ప్రత్యేక బస్సులు

March 14, 2023
img

తెలంగాణ రాష్ట్రంలో బుదవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రధమ 4,82,677 మంది, ద్వితీయ 4,64,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయబోతున్నారు. 

వీటికోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రానికి ఒక్కో సూపరింటెండెంట్‌, ఒక్కో డిపార్ట్‌మెంట్ ఆఫీసర్  చొప్పున 2,546 మంది పర్యవేక్షించబోతున్నారు. అదేవిదంగా 26,333 మంది ఇన్విజిలెటర్స్, 75 మంది ఫల్యింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ని ఏర్పాటుచేసింది. 

ఇక పరీక్షా కేంద్రాలకు చేరుకొనేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులు ఎక్కడ చెయ్యి చూపి ఆపమని కోరినా బస్సులను ఆపాలని నిర్ధిష్ట ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు, అవసరమైతే ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను కంట్రోల్ రూముతో అనుసంధానం చేశారు. విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలకు హాజరుకావాలని ఇంటర్ అధికారులు సూచిస్తున్నారు. 

Related Post