తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల వివరాలు

January 25, 2023
img

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిభ్రవరి 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. గ్రూప్-3లో మొత్తం 1363 పోస్టులు ఉండగా వాటిలో జూనియర్ అసిస్టెంట్: 655, సీనియర్ అకౌంటెంట్: 436, ఆడిటర్: 126, అసిస్టెంట్ ఆడిటర్: 23, జూనియర్ అకౌంటెంట్: 61, అకౌంటెంట్: 1 పోస్టులు భర్తీకి టిఎస్‌పీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. 

అర్హతలు, వయో పరిమితి: సంబందిత డిగ్రీ చేసి ఉండాలి. 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మద్య వయసు కలిగి ఉండాలి. లేదా 02-07-1978 నుంచి 01-07-2004 మద్య జన్మించినవారై ఉండాలి. 

రిజర్వేషన్స్: 

ప్రభుత్వోద్యోగులు, టీఎస్‌ఆర్టీసీ తదితర సంశలలో ఉద్యోగులకి, వివిద కార్పొరేషన్లలో చేస్తున్న ఉద్యోగులకి వారి సర్వీసుని బట్టి 5 ఏళ్ళు మినహాయింపు లభిస్తుంది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్: 5 ఏళ్ళు, వికలాంగులకి 10 ఏళ్ళు మినహాయింపు లభిస్తుంది.

ఎక్స్‌ సర్వీస్ మెన్ మరియు ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్: వారి సర్వీసుని బట్టి 3 ఏళ్ళు మినహాయింపు లభిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.280. నిరుద్యోగులైతే ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వోద్యోగులు పరీక్ష ఫీజు రూ.80 చెల్లిస్తే చాలు. 

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. మూడు పేపర్లకి ఒక్కో దానికి 150 చొప్పున మూడు పేపర్లకి 450 మార్కులు ఉంటాయి. 

గ్రూప్-3 ఉద్యోగాలకి సంబందించి పూర్తి వివరాలన్నీ టిఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in లో ఉంచారు. 

Related Post