గ్రూప్-4లో 9,168 పోస్టులకి నోటిఫికేషన్‌ జారీ

December 02, 2022
img

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త! వివిద ప్రభుత్వ శాఖలలో 9,168 పోస్టుల భర్తీకి టిఎస్‌పీఎస్సీ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్ 6,859 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ 429 పోస్టులు, జూనియర్ ఆడిటర్ 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ 1,862 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్ధికశాఖ అనుమతించిన వారం రోజులలోపే వీటికి టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం విశేషం. 

ఈ ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తులకి జత చేయాల్సిన ధృవపత్రాలను సమకూర్చుకొనేందుకు మూడు వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయి కనుక మే నెలలో ఈ పరీక్షలను నిర్వహించాలని టిఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనుంది. టిఎస్‌పీఎస్సీ వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో సుమారు 4,000 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

Related Post