గ్రూప్-4లో 9,168 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గీన్ సిగ్నల్

November 26, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఓ శుభవార్త! రాష్ట్ర ఆర్ధికశాఖ 9,168 ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటన్నిటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్‌ విధానంలో భర్తీ చేస్తారు. ప్రభుత్వంలో 25 శాఖలలో 91 విభాగాలలో 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పురపాలక శాఖలో 1,862 వార్డు స్థాయి అధికారుల పోస్టులు, పురపాలక, ఆర్ధిక శాఖలలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్ శాఖలో 18 జూనియర్ ఆడిటర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆయా ఖాళీల భర్తీకి విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్స్, స్థానికత తదితర వివరాలను టిఎస్‌పీఎస్సీకి అందించగానే వాటి ఆధారంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియకి సుమారు నెలన్నర సమయం పట్టవచ్చు. కనుక వచ్చే ఏడాది జనవరి-ఫిభ్రవరి మద్య ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని భావించవచ్చు. 


Related Post