తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షల ఫలితాలు విడుదల

October 21, 2022
img

తెలంగాణ పోలీస్, అగ్నిమాపక, జైళ్ళు, పోలీస్ రవాణా, ఎక్సైజ్ శాఖలలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్ట్ 7వ తేదీన పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు నిర్వహించిన ప్రాధమిక పరీక్షల ఫలితాలను ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. మొత్తం 16, 321 పోస్టులకు పరీక్ష నిర్వహించగా 6,61,198 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో 6,03,955 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. వారిలో సివిల్ ఎస్సై ప్రాధమిక పరీక్ష వ్రాసిన వారిలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వ్రాసినవారిలో 31.40 శాతం, రవాణా కానిస్టేబుల్ కోసం వ్రాసిన వారిలో 44.84 శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ కోసం వ్రాసినవారిలో 43.65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు రిక్రూట్మెంట్‌ బోర్డు ప్రకటించింది. 

రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రిక్రూట్మెంట్‌ బోర్డు కటాఫ్ మార్కులను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాధమిక పరీక్షలో మొత్తం 200 మార్కులలో ఓసీలకైతే 60మార్కులు, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు సాధించినవారు అర్హత సాధించినట్లే. ఈ పరీక్ష ఫలితాలను www.tslprb.org.in. వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 


Related Post