డిసెంబర్‌లోగా దండుమల్కాపూర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ రెడీ

October 08, 2022
img

నల్గొండ జిల్లాలోని దండుమల్కాపూర్‌లో 547 ఎకరాలలో విస్తరించి ఉన్న ఎంఎస్‌ఎంఈ–గ్రీన్‌ ఇండస్ట్రియల్ పార్కులో 589 చిన్న, మద్యతరగతి పరిశ్రమలు ఏర్పాటుకాబోతున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 20,000 మందికి, పరోక్షంగా మరో 16,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. కనుక అక్కడ ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలలో పనిచేసేందుకు తగిన శిక్షణ అవసరం. కనుక రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని అక్కడే ‘స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్’ ను కూడా ఏర్పాటు చేస్తోంది. అది ఈ ఏడాది డిసెంబర్‌నాటికి అందుబాటులోకి వస్తుందని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్‌, నిర్మాణంలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ భవనం ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.             


Related Post