తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా

September 26, 2022
img

ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఈ నెల 28వ తేదీ నుంచి జరుగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేడు ప్రకటించింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి రెండో విడత కౌన్సిలింగ్‌ ప్రారంభిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. కనుక అక్టోబర్‌ 11,12 తేదీలలో స్లాట్ బుకింగ్, 12వ తేదీన సర్టిఫికెట్స్ పరిశీలన, 12,13 తేదీలలో వెబ్‌ ఆప్షన్స్ నమోదు, 16వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేడు ప్రకటించింది. 


Related Post