దసరా సెలవులపై విద్యాశాఖ ఏమందంటే...

September 21, 2022
img

దసరా సెలవులు కుదించినట్లు మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. సెలవులు తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చేసిన ప్రతిపాదనే ఈ వార్తలకు కారణమని వివరించింది. జూలై నెలలో భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున, ఆ మేరకు ఇప్పుడు దసరా సెలవులను తగ్గించాలని ఎస్సీఈఆర్టీ  సూచించిందని కానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించామని విద్యాశాఖ తెలిపింది. కనుక దసరా సెలవులు తగ్గించడంలేదని ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వరకు రాష్ట్రంలో దసరా సెలవులు యదాతదంగా ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 10వ తేదీన పాఠశాలలన్నీ పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.      


Related Post