దసరా పండుగకు 13 రోజులు సెలవులు

September 13, 2022
img

తెలంగాణలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఓ తీపి కబురు చెప్పింది. దసరా పండుగకు 13 రోజులు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ నేడు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మళ్ళీ అక్టోబర్ 10వ తేదీన రాష్ట్రంలో విద్యాసంస్థలన్నీ తెరుచుకొంటాయి. ఈనెల 25వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీతో ముగుస్తుంది. కనుక బతుకమ్మ పండుగ సంబురాలు మొదలైన మరుసటి రోజు నుంచి అది పూర్తయిన వారం రోజుల వరకు సెలవులు విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగకు రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉంటుంది.                 


Related Post