తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ

September 12, 2022
img

టిఎస్‌పీఎస్సీ ఈరోజు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో 833 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాటిలో అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబందించిన పూర్తి వివరాలు టిఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో లభిస్తాయి. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఇటీవలే మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, మహిళా శిశు సంక్షేమశాఖలో 23 పోస్టులకు టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల కటాఫ్ మార్కులు సదలిస్తామని ఈరోజు సిఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు.  


Related Post