తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా

August 08, 2022
img

ఈ నెల 21న జరగాల్సిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ 28కి వాయిదా పడ్డాయి. సాంకేతిక కారణాల చేత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు ఈరోజు ప్రకటించింది. 

పోలీస్, అగ్నిమాపక, జైళ్ళు, ఎక్సైజ్ శాఖలలో కలిపి మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్‌ వెలువడగా ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 40 పరీక్షా కేంద్రాలలో  కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబోతోంది.


Related Post