టిఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ జారీ.. 53 పోస్టులు మాత్రమే

August 05, 2022
img

టిఎస్‌పీఎస్సీ ఈరోజు మరో జాబ్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈసారి కేవలం 53 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ వచ్చింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో టిఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత, వయో పరిమితి: జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ళలోపు ఉండాలి. ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్షను ఈ ఏడాది డిసెంబరులో నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తివివరాల కొరకు ఈ లింక్ ప్రెస్‌చేసి చూడవచ్చు   https://www.tspsc.gov.in/preview/PRESSNOTE/08-2022-DAO-NOTIFN-FINAL-120220805141210.pdf లేదా https://www.tspsc.gov.in/website ను సందర్శించవచ్చు.

Related Post