ఒక్క జడ వేసుకొచ్చినందుకు గుంజీలు.. పీఈటీ సస్పెండ్

August 05, 2022
img

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు శ్వేత (పీఈటి) బాలికలపై తన ప్రతాపం చూపారు. రెండు జడలకు బదులు ఒక్క జడ వేసుకొని స్కూలుకి వచ్చినందుకు విద్యార్ధినుల చేత 200 గుంజీలు తీయించారు. దాంతో 25 మంది విద్యార్ధినులు సొమ్మసిల్లిపోగా కొందరు నిలబడలేకపోతున్నారు. కొందరు విద్యార్ధినులు జ్వరం, కాళ్ళ వాపు, ఒళ్ళునొప్పులతో బాధపడుతున్నారు. సొమ్మసిల్లిపోయిన విద్యార్ధినిలను బాదేపల్లి కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన మిగిలిన విద్యార్ధినులకి జడ్చర్ల పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ శివకాంత్‌ను రప్పించి చికిత్స చేయించారు. పీఈటీ శ్వేతపై విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్ధి సంఘాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


Related Post