జూలై 30 నుంచి ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌

July 29, 2022
img

తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్నవారికి ఆగస్ట్ 7వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. కనుక జూలై 30 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఆగస్ట్ 5వ తేదీ అర్దరాత్రి వరకు www.tslprb.in  నుంచి అభ్యర్ధులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించింది. 

హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా సమస్యలు ఎదురైతే 93937 11110 లేదా 939100 5006 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు. లేదా support@tslprb.in కు ఈమెయిల్ ద్వారా తమ సమస్యను తెలియజేసి పరిష్కారం పొందవచ్చు. 

ఈ ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 2,47,217 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35 పట్టణాలలో 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని రిక్రూట్మెంట్‌ బోర్డు తెలిపింది. ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్ష నిర్వహించబడుతుంది.

Related Post