రవాణాశాఖలో 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

July 28, 2022
img

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి టిఎస్‌పీఎస్సీ బుదవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సంర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబందించి పూర్తి వివరాల కొరకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  

మల్టీ జోన్-1లో 54 పోస్టులు, మల్టీ జోన్-2లో 59 పోస్టులు కలిపి మొత్తం 113 పోస్టులు భర్తీ చేయనుంది. 

అర్హతలు: 

వయసు: 21-39 ఏళ్ళలోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు 5 ఏళ్ళు, మాజీ సాయినికులకు 3 ఏళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీసులో చేరినప్పటి నుంచి 5 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ మెకానికల్, ఆటోమోబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా లేదా పాలిటెక్నిక్ కళాశాల నుంచి మూడేళ్ళ డిప్లొమా చేసి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.200 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు కలిపి మొత్తం రూ.320. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

పరీక్షా విధానం: ఈ ఏడాది నవంబరులో ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌ఎండీఏ పరిధిలో గల జిల్లాలలో ఈ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. 

Related Post