హైదరాబాద్‌లో జూన్ 29న జాబ్‌మేళా

June 25, 2022
img

ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లో పోలీస్ శాఖ, టిఎమ్‌టి ఫౌండేషన్, సెప్టెంబర్ సిటీ, మరియు ఎఫ్ఐసిసిఐ ఫ్లో సంస్థల అధ్వర్యంలో జాబ్‌మేళా జరుగబోతోంది. ఈ మేళాలో బిగ్‌బాస్ బాస్కెట్, టిఎమ్ గ్రూప్, ఎయిర్ టెల్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, అపోలో ఫార్మసీ, ఐసిఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర  సంస్థలు పాల్గొని మొత్తం 1,500 మందిని భర్తీ చేసుకొనున్నాయి. 

విద్యార్హతలు: ఇంటర్ నుంచి డిగ్రీ 

ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకొనే అభ్యర్ధులు ముందుగా bit.ly/jcepass అనే లింక్ ద్వారా లేదా నేరుగా https://form.jotform.com/tmi/QRCode లో తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. 

ఈ నెల 29వ తేదీన హెరిటేజ్ ప్యాలస్, 1-47-908/4, ముషీరాబాద్, మెయిన్ రోడ్, ముషీరాబాద్, బాకారం,  కవాడీగూడ, హైదరాబాద్‌-500020 వద్ద ఉద్యమ 9 గంటల నుంచి జాబ్‌మేళా జరుగుతుంది.

Related Post