ఇంటర్‌లో ఈసారి పూర్తి సిలబస్ బోధన

June 24, 2022
img

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ ప్రధమ, ద్వితీయలో పూర్తిస్థాయి సిలబస్ ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి మహమ్మద్ జలీల్ తెలిపారు. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా సరిగ్గా క్లాసులు జరగకపోవడం వలన పరీక్షలలో విద్యార్దులు ఒత్తిడికి గురవకూడదనే ఉద్దేశ్యంతో 70 శాతం సిలబస్ మాత్రమే భోధించి ఆ ప్రకారమే పరీక్షలు నిర్వహించమని చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించి 100 శాతం సిలబస్ భోధిస్తామని చెప్పారు. త్వరలోనే ఇంటర్మీడియెట్ సిలబస్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని చెప్పారు. కనుక రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలు, విద్యార్దులు దీనిని గమనించాలని మహమ్మద్ జలీల్ విజ్ఞప్తి చేశారు.     

ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు రేపు విడుదలకాబోతున్నాయి. అలాగే ఈ నెలాఖరులోగా పదో తరగతి ఫలితాలు వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు ఇంటర్ రెండో సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నవారికి, పదో తరగతి పాసై ఇంటర్‌లో చేరబోతున్నవారికి పూర్తి సిలబస్ చదువుకోవడం వలన మేలు కలుగుతుంది.

Related Post