తెలంగాణ ఉన్నత విద్యావ్యవస్థలో మరో చక్కటి నిర్ణయం

June 23, 2022
img

తెలంగాణ ఉన్నత విద్యావ్యవస్థకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో గల 15 యూనివర్సిటీలలో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియమకాలను సులువుగా చేపట్టేందుకు వీలుగా అన్ని యూనివర్సిటీలకు కలిపి కామన్ రిక్రూట్మెంట్‌  బోర్డును ఏర్పాటు చేసింది. ఇక నుంచి 15 యూనివర్సిటీలలో నియమాకాలన్నీ ఈ బోర్డు ద్వారానే జరుగుతాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి ఈ కామన్ రిక్రూట్మెంట్‌  బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ బోర్డు కన్వీనరుగా కళాశాల విద్యాకమీషనర్ వ్యవహరిస్తారు. విద్యాశాఖ, ఆర్ధికశాఖల కార్యదర్శులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. కామన్ రిక్రూట్మెంట్‌  బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో నంబర్16ని జారీ చేసింది.   


Related Post