పోలీస్ ఉద్యోగ పరీక్షలలో కొన్ని మార్పులు

May 07, 2022
img

తెలంగాణ పోలీస్ శాఖలో 16,614 ఉద్యోగాల భర్తీకి మే 20వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల రాత, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు సంబందించి కొన్ని ముఖ్యమైన వివరాలను నియామక మండలి ఛైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.  

• ఈ ఉద్యోగాలకు చాలా భారీ సంఖ్యలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొంటారు కనుక వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రాధమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు జూలై నెలాఖరున లేదా ఆగస్ట్ మొదటివారంలో నిర్వహించి, సెప్టెంబర్‌ వాటి ఫలితాలు ప్రకటించాలనుకొంటున్నట్లు చెప్పారు. 

• వాటిలో ఉత్తీర్ణులైనవారికి అక్టోబర్ రెండో వారంలో శారీరిక ధారుడ్య పరీక్షలు నిర్వహించబడతాయి. 

• ఎస్సై, కానిస్టేబుల్ రెండు ఉద్యోగాలకు కొంతమంది ఎంపికవుతుంటారు. వారిలో ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైనవారి పేర్లను కానిస్టేబుల్ ఉద్యోగాల జాబితాలో నుంచి వెంటనే తొలగించబడతాయి. తద్వారా ఆ ఉద్యోగాలు మిగిలినవారికి లభిస్తాయి. 

• ఈసారి శారీరిక ధారుడ్య పరీక్షలో 100, 800 మీటర్ల పరుగు రద్దు చేసి వాటికి బదులు పురుషులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు.  

• ఈసారి శారీరిక ధారుడ్య పరీక్షలో హైజంప్ పరీక్ష ఉండదు. 

• అలాగే ఇక నుంచి అభ్యర్ధుల ఛాతి కొలతలు తీసుకోబడవు. .

• అభ్యర్ధులు మైదానంలో ప్రవేశించేటప్పుడే, వారి చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాండ్ వేస్తారు. తద్వారా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.  

ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కొరకు www.tslprb.in  వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

విభాగం

ఉద్యోగం

ఖాళీల సంఖ్య

సివిల్

ఎస్ఐ

414

ఎస్ఏఆర్ సీపీఎల్

ఎస్ఐలు

05

సివిల్-ఏఆర్

ఎస్ఐలు

66

టీఎస్ఎస్‌పీ

ఎస్ఐలు

23

స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్

ఎస్ఐలు

12

విప‌త్తు నిర్వ‌హ‌ణఅగ్నిమాప‌క శాఖ

ఎస్ఐలు

26

జైళ్ల శాఖ

ఎస్ఐలు

08

ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్

ఎస్ఐలు

22

పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్

ఎస్ఐలు

03

ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో

ఏఎస్ఐలు

08

విభాగం

ఉద్యోగం

ఖాళీల సంఖ్య

సివిల్

కానిస్టేబుల్స్

4965

ఏఆర్

కానిస్టేబుల్స్

4423

ఎస్ఏఆర్ సీఎల్

కానిస్టేబుల్స్

100


టీఎస్ఎస్‌పీ

కానిస్టేబుల్స్

5010

స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్

కానిస్టేబుల్స్

390

విప‌త్తు నిర్వ‌హ‌ణఅగ్నిమాప‌క శాఖ

కానిస్టేబుల్స్

610

జైళ్ల శాఖ

కానిస్టేబుల్స్ (పురుషులు)

136

జైళ్ల శాఖ

కానిస్టేబుల్స్ (స్త్రీలు)

10

ఐటీక‌మ్యూనికేష‌న్

కానిస్టేబుల్స్

262

మెకానిక్

కానిస్టేబుల్స్

21

డ్రైవర్స్

కానిస్టేబుల్స్

100

Related Post