డిసెంబర్‌ 6న జేఎన్టీయూ హైదరాబాద్‌లో జాబ్‌మేళా

December 02, 2021
img

హైదరాబాద్‌ జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 6వ తేదీన జేఎన్టీయూలో మెగా జాబ్‌మేళా జరుగనుంది. దీనిలో ఇంటెల్, విప్రో, టెక్ మహీంద్రా వంటి 30 ప్రముఖ కంపెనీలు పాల్గొని 2,824 మంది ఉద్యోగులను భర్తీ చేసుకొంటాయని జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి చెప్పారు. కనుక అర్హత, ఆసక్తి ఉన్నవారు ముందుగా https://forms.gle/YwiYpgoPoruto8TRA లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.  ఈ జాబ్‌మేళాలో ఫ్రెషర్స్ మరియు అనుభమ్ ఉన్నవారికి కూడా ఉద్యోగావకాశాలున్నాయి. డిసెంబర్‌ 6న ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేఎన్టీయూలో కొత్త అడ్మిషన్ బ్లాకులో ఈ జాబ్‌మేళా జరుగనుంది. దీనికి సంబందించి పూర్తి వివరాల కోసం శ్రీలలిత: 72079 19709 లేదా రాధిక: 90321 99661 లేదా ఉదయ్: 91542 51963 నెంబర్లలో సంప్రదించవచ్చు.    

జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఖాళీలు, అర్హతలు, జీతం తదితర వివరాల కోసం: https://www.forum.universityupdates.in/attachments/companies_list_for_mega_job_mela-pdf.19546/  


Related Post