తెలంగాణలో ఉద్యోగాల భర్తీ...మరి కొంత ఆలస్యం?

November 24, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని ఇటీవల సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ సంక్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజులుపైనే పట్టవచ్చని తెలుస్తోంది. ఒకవేళ డిసెంబర్‌ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయినట్లయితే, జనవరి నెలాఖరులోగా నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది. మొత్తం 67,820 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

వాటిలో అత్యధికంగా హోంశాఖలో 21,507 పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 10,048, ఎస్‌జీటీలో 8,862 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత వరుసగా ఉన్నత విద్య శాఖలో 3,825 పోస్టులు, బీసీ సంక్షేమంలో 3,538, ఎస్సీ సంక్షేమం శాఖలో 1,967, గిరిజన సంక్షేమం శాఖలో 1,700, స్కూల్‌ అసిస్టెంట్‌: 1,694, పురపాలక శాఖలో 1,148, మైనార్టీటీ సంక్షేమం శాఖలో 1,437, రెవెన్యూ శాఖలో 1,441, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,391, నీటి పారుదల శాఖలో 1,222, లాంగ్వేజ్‌ పండిట్‌: 1,211, అటవీశాఖలో 1,096, కార్మిక శాఖలో 980, ఆర్థికశాఖలో 838, స్త్రీ శిశుసంక్షేమంలో 800, వ్యవసాయ శాఖలో 742, పశుసంవర్థకశాఖలో 628, రోడ్లు భవనాలు, రవాణా శాఖల్లో 492, పీఈటీ: 458, పరిశ్రమల శాఖలో 292, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (జీఏడీ)లో 220, సాంస్కృతిక, పర్యాటక శాఖలో 69, ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌లో 65, పౌర సరఫరాల శాఖలో 48, శాసనసభ వ్యవహారాల శాఖలో 38, ఇంధన శాఖలో 33, న్యాయశాఖలో 26, ఐటీశాఖలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. 

Related Post