టిఎస్‌పీఈసెట్ ఫలితాలు నేడే విడుదల

November 01, 2021
img

తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు పీఈ సెట్ కన్వీనర్ తెలిపారు. దీనిలో ఉత్తీర్ణులైనవారు యూజి డిపిఈడి, బీపీఈడి కోర్సులలో ప్రవేశం పొందవచ్చు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, పీఈసెట్ చైర్మన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పారు.  టిపిఈ సెట్ ప్రవేశ పరీక్షలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో ఒకే రోజు నిర్వహించారు.

టిఎస్‌పీఈసెట్ ఫలితాలకోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


Related Post