ఎంబీఏ, ఎంసిఎ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

October 28, 2021
img

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంబీఏ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ మొదటి, రెండవ షెడ్యూల్స్‌ ప్రకటించింది. ఆగస్టులో నిర్వహించిన ఐసెట్‌లో 51 వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలో రెండు కోర్సులలో దాదాపు 35 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 23 వేల సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. మిగతా సీట్లను ఆయా కళాశాల మేనేజ్ మెంట్ కోటలో భర్తీ చేస్తారు. 

 ఐ సెట్ మొదటి విడత షెడ్యూల్ వివరాలు: 

స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీజులు:  నవంబర్ 3 నుంచి 9 వరకు

 సర్టిఫికెట్ల పరిశీలన: నవంబర్ 6 నుంచి 11 వరకు

 వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్6 నుంచి 11 వరకు

 మొదటి విడత సీట్ల కేటాయింపు: నవంబర్ 14

 ట్యూషన్ ఫీజుల చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: నవంబర్ 14 నుంచి 18 వరకు.

ఐసెట్ రెండో విడత  షెడ్యూల్

స్లాట్ బుకింగ్: నవంబర్21

సర్టిఫికెట్ల పరిశీలన: నవంబర్ 22

వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్ 22, 23

రెండో విడత సీట్ల కేటాయింపు: నవంబర్ 26

 ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: నవంబర్ 27 నుంచి 29 వరకు.

వీటిలో  మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్: నవంబర్ 28వ తేదీన.  


Related Post