కామారెడ్డి కలక్టరేట్ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా

October 24, 2021
img

కామారెడ్డి జిల్లాలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు. దీనిలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని ఖాళీ పోస్టులకు అర్హులైన వారిని ఎంపిక చేసుకొని ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చునని తెలిపారు. అభ్యర్ధులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఈ జాబ్‌మేళా సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. 

 అర్హతలు : ఇంటర్, డిగ్రీ, పీజీ

 వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు.

జాబ్ మేళా జరుగు స్థలం : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ 121.

పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు :761974009, 8905748423, 9573381979.

Related Post