తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాలలో ఖాళీలు భర్తీ

October 22, 2021
img

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 5,323 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలను ప్రకటించి, నియామక పక్రియను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ  పాఠశాలలో 2,343 ఇన్స్పెక్టర్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 937 పోస్ట్ గ్రాడ్యూవెట్ రెసిడెన్షియల్ టీచర్లు,1,435 వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ప్రభుత్వ  కళాశాలలకు  211 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.


Related Post