సూర్యాపేటలో సివిల్స్‌ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ

September 25, 2021
img

సూర్యాపేట జిల్లాలో 2021-2022 సివిల్స్‌ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఉచిత శిక్షణకు ఎంపికైనవారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్‌ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని వారి తల్లితండ్రుల వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపారు.  

జిల్లాలో అర్హులైన అభ్యర్ధులు ఈ ఉచిత శిక్షణ కొరకు అక్టోబర్ 10వ తేదీలోగా www.tsscstudentscircle.co.in వెబ్‌సైట్‌ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికి సంబందించి పూర్తి వివరాల కోసం 99891 29935 నెంబరుకి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.  


Related Post