శుక్రవారం హైదరాబాద్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఇందులో అపోలో ఫార్మసీ, స్కమార్ బీపిఓ, క్యాష్ కార్డు లిమిటెడ్, జేఎసీ ఆటోమోటివ్, కాలిటర్ వంటి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్మేళా జరగనుంది. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమవెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని సూచించారు.
అర్హతలు: పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐ టి ఐ, బి ఫార్మసీ
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ళలోపు
వేతనం నెలకు: రూ 10వేల నుంచి 15వేల వరకు.
జాబ్మేళా జరుగు స్థలము: మల్లెపల్లి ఉపాధి కార్యాలయం, హైదరాబాద్.
పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబరు: 82476 56356.