తెలంగాణ ఇంటర్ విద్యాసంవత్సరం ఖరారు

September 07, 2021
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు 2021-2022 సం.లకు విద్యాసంవత్సరాన్ని ఖరారు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్‌ క్లాసులతో కలిపి మొత్తం 220 పని దినాలుగా ప్రకటించింది. వచ్చే నెల దసరా పండుగకు ఆదివారంతో కలిపి మొత్తం ఐదు రోజులు, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు జనవరి (13 నుంచి 15 వరకు) మూడు రోజులు శలవు దినాలుగా ప్రకటించింది. 

పరీక్షల షెడ్యూల్: 

అర్ధ సంవత్సర పరీక్షలు: డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు. 

ప్రీ-ఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు. 

ఇంటర్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు.

ఇంటర్ వార్షిక పరీక్షలు: మార్చి 23 నుంచి.  

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు: మే చివరి వారంలో.

వేసవి సెలవులు: ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు. 

కళాశాలలు పునః ప్రారంభం: జూన్‌కు 1 వ తేదీ నుంచి. 

Related Post